![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -127 లో...... ప్రేమ దగ్గరికి రేవతి వస్తుంది. ప్రేమ తన తల్లిని చూడగానే ఎమోషనల్ అవుతుంది. నువ్వు ఈ ఇంట్లో ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ ఎప్పుడు నువు లక్ష్మీదేవిలా నగలతో కళకళలాడుతు ఉండాలని ప్రేమకి నగలు ఇస్తుంది రేవతి. దాంతో ప్రేమ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక నేను వెళ్ళొస్తా అంటూ రేవతి వెళ్తుంది. గుమ్మం బయటే పెద్దావిడ వింటుంది. రేవతి రాగానే ఎక్కడ మీ ఆయన చూస్తాడోనని టెన్షన్ అయిందని లోపలికి వస్తుండగా సేనాపతి, భద్రవతి ఎదరుపడుతారు.
ఎక్కడికి వెళ్ళావని రేవతిని సేనాపతి అడుగుతాడు. ఆ ఇంట్లో ఉన్న నా కూతురికి నగలు ఇవ్వడానికి వెళ్ళాననగానే రేవతిని కొడతాడు సేనాపతి. దాంతో పెద్దావిడ ఆపుతుంది నీకేమైనా బుద్ది ఉందా ప్రేమను ఎలా రప్పించుకోవాలో నేను ఆలోచిస్తుంటే.. నువ్వు అక్కడికి వెళ్లి నగలు ఇచ్చావా అంటూ రేవతిపై కోప్పడుతుంది భద్రవతి. మరొకవైపు చందు ఎన్ని ప్రయత్నాలు చేసిన డబ్బు దొరకదు. శ్రీవల్లి ని కలవడానికి చందు రెస్టారెంట్ కి వస్తాడు. తను ఎలాగైనా పది లక్షలు తీసుకొని వస్తాను అనేలా చందుతో భాగ్యం చెప్పినట్లుగా మాట్లాడుతుంది శ్రీవల్లి.ఆ తర్వాత తన తల్లి తెచ్చిన నగలన్ని పెట్టుకుంటుంది ప్రేమ. ధీరజ్ ని పిలచి ఎలా ఉన్నాయని అడుగుతుంది. మొదట వెటకారం గా మాట్లాడిన ఆ తర్వాత బాపు బొమ్మలా ఉన్నావంటూ పొగుడుతాడు. తరువాయి భాగం లో చందు ఒక సేట్ దగ్గరికి వెళ్లి వడ్డీ కి డబ్బు కావాలని అంటాడు. మీ నాన్న ని తీసుకొని రా అని అతను అంటాడు. అప్పుడే రామరాజు శుభలేక ఇవ్వడానికి సేట్ దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |